ఖర్గే వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు: క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: దిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దిల్లీ, బెంగళూరు, పాట్నాలలో ఆందోళనలు నిర్వహించిన కమలనాథులు, ఖర్గే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.