మహిళా కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ డైపర్లు వేసుకోవాలని సూపర్వైజర్ వేధింపులు
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లీఫ్రెష్ కంపెనీలో రోజుకు కేవలం రూ.400 వేతనం ఇస్తూ మహిళా కార్మికులను సూపర్వైజర్ తీవ్రంగా వేధిస్తున్నాడు. మూత్రవిసర్జనకు వెళ్లకుండా డైపర్లు వేసుకోవాలని, తనతో సాన్నిహిత్యంగా ఉంటేనే వేతనాలు పెంచుతానని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని కోరుతూ కంపెనీ ఎదుట ధర్నాకు దిగిన కార్మికులు, పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు పోతాయని వారు భయాందోళన చెందుతున్నారు.