సల్మాన్ ఖాన్ కొత్త లుక్: సంచలనంగా మారిన బాలీవుడ్ స్టార్ మేకోవర్

రిపోర్టర్: అశోక్ స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సరికొత్త లీన్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి వేడుకల్ లో సల్మాన్ కనిపించిన తీరు వైరల్ గా మారింది. తొంభైల నాటి మ్యాజిక్ ను గుర్తుచేసేలా ఆయన మేకోవర్ ఉందని అభిమానులు ప్రశంసించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న మాన్ స్టర్ సినిమా కోసం ఆయన ఈ రూపంలోకి మారినట్లు సమాచారం.