షాజహాన్పూర్లో ఆలయ పూజారుల హత్యతో భయానక ఘటన

రిపోర్టర్: కిరణ్ స్థలం: షాజహాన్‌పూర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలో ఆలయంలో నివసిస్తున్న ఇద్దరు వృద్ధ పూజారులు హత్యకు గురయ్యారు. ఆలయంపై పట్టు సాధించాలనే దురాశతో సుమిత్ సింగ్ అనే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ సౌరభ్ దీక్షిత్ వెల్లడించారు. బిహారీ దాస్, గోపాల్ దాస్ అనే పూజారులపై బరువైన వస్తువుతో దాడి చేసి, అనంతరం వారి మృతదేహాలకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.