అమెరికా ఎన్నికల్లోనూ మన సంస్కృతి: హోటల్లో దోశలు వేసిన అభ్యర్థి
రిపోర్టర్: సురేష్
స్థలం: అమెరికా
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయ నేతలు భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ ప్రచారంలో జోరు పెంచారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జేమ్స్ తలారికో డాలస్ శివారులోని ఓ హోటల్లో స్వయంగా దోశలు వేశారు. ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు దేవాలయాలను సందర్శించడం, పండుగ వేడుకల్లో పాల్గొనడం వంటి వినూత్న ప్రచార శైలిని అవలంబిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.