హైదరాబాద్ లో వైద్య సేవల వైఫల్యం: ఎంఎన్జే ఆసుపత్రిలో స్ట్రెచర్లపై సిమెంట్ బస్తాల తరలింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని ప్రముఖ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య సేవలు తీవ్రంగా గాడి తప్పాయని, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగినట్లుగా మౌలిక వసతులు లేకపోవడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని వారు తెలిపారు. అంతేకాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కేటాయించిన స్ట్రెచర్లు, వీల్చైర్లను భవన నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమెంట్ బస్తాల రవాణాకు వాడుతుండడం కలకలం రేపుతోంది.