మహిళా ప్రీమియర్ లీగ్ విస్తరణపై బీసీసీఐ ఆలోచన: త్వరలో కీలక నిర్ణయం
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు వచ్చే ఏడాది నుంచి మహిళా ప్రీమియర్ లీగ్ జట్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. కొచ్చిలో జరిగిన వేలంలో చాలా మంది క్రీడాకారిణీలు ఎంపిక కాలేదని, ప్రస్తుత ఐదు జట్లు సరిపోవని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో జట్ల పెంపుపై కసరస్సు చేస్తామని సైకియా స్పష్టం చేశారు.