తిరుమలలో నాఖాబందీ.. 8 మంది అనుమానితులు అదుపులోకి!
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతా చర్యలను పటిష్టం చేయడంలో భాగంగా పాపవినాశనం, ఆకాశగంగ పరిసర ప్రాంతాల్లో నాఖాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.
మొత్తం 170 షాపులను తనిఖీ చేసి 8 మంది గుర్తింపు లేని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 5 వాహనాలను స్వాధీనం చేసుకుని, 32 లైసెన్స్ లేని షాపులను గుర్తించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు భద్రతా చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.