ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదం, యువతికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పాతబస్టాండ్ కూడలిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా వాహనం కదలడంతో జారిపడి యువతి ఉషారాణి కాలు విరిగింది. ప్రయాణికురాలు కిందపడినా పట్టించుకోకుండా డ్రైవరు బస్సుతో వెళ్లిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలను పరామర్శించారు.