పాలకుల నిర్లక్ష్యపు నీడలో మరుగునపడుతున్న తెలంగాణ విమోచన పోరాట చరిత్ర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తాండూరు

మంచిర్యాల జిల్లా తాండూరు మండల ఉప తహశీల్దార్కు మంగళవారం బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు తీవ్రంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం స్వతంత్ర పోరాట చరిత్రను మరుగున పడేస్తున్నాయని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో అధికారికంగా వేడుకలు జరుపుతుంటే ఇక్కడ అలసత్వం వహించడం సరికాదని, ఆపరేషన్ పోలో పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని నాయకులు దూడపాక భరత్ కుమార్, శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.