ఏన్కూర్ ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం దక్కడంపై హర్షం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో ఏన్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించిందని ప్రధానోపాధ్యాయురాలు వాసవి దేవి తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనుమాసుపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి వల్లే ఈ అవార్డు దక్కిందని ఆమె పేర్కొన్నారు.