తలకొండపల్లిలో గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తలకొండపల్లి

తలకొండపల్లి మండలంలో హెచ్పీ గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సుమారు 25 రోజులకు ఒకసారి సిలిండర్ అందాల్సి ఉండగా, బుకింగ్ చేసిన అనంతరం డీలర్ను సంప్రదిస్తే ప్రస్తుతం నిల్వలు లేవని సమాధానం వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో వంట గ్యాస్ కోసం ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.