ఎన్బీఎఫ్సీ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు టాటా సన్స్ కొత్త వ్యూహం
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీలో రెండు సంస్థలను విలీనం చేయాలని టాటా ట్రస్ట్స్ ప్రతిపాదించినట్లు ఆర్థిక నిపుణులు తెలిపారు. ఆర్బీఐ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నిబంధనల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ విలీన ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపు, స్టాక్ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశం వంటి అంశాలపై టాటా బోర్డులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. టాటా సన్స్ ప్రైవేట్గానే కొనసాగాలని ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా గట్టిగా కోరుతున్నారు.