చెన్నై మైనర్ బాలికల లైంగిక వేధింపుల కేసులో మరో అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
చెన్నైలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికల లైంగిక వేధింపుల కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక వీడియోను కలిగి ఉండి అధికారులకు సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి మాజీ ఉద్యోగి గణేశన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ వాగ్వాదం చెలరేగింది.