జైపూర్లో దారుణం: ప్రియురాలిని హత్య చేసి రెండు రోజులు శవంతోనే గడిపిన నిందితుడు
రిపోర్టర్: శివ
స్థలం: Jaipur
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో లేదా గొడవ కారణంగా ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన సహజీవన భాగస్వామి లక్ష్మి రేగర్ను ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడని ఏసీపీ దీపక్ ఖండేల్వాల్ వెల్లడించారు. హత్య తర్వాత మృతదేహంతో పాటు ముగ్గురు పిల్లలతో రెండు రోజులు ఇంట్లోనే గడిపిన నిందితుడు, శుక్రవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.