హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు మరియు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ మేరకు తెలంగాణ సీఎంవో అధికారికంగా వెల్లడించింది.