మొబైల్ డేటా లేకుండా నేరుగా లైవ్ టీవీ సేవలు అందించేలా డీ2ఎమ్ టెక్నాలజీ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
మొబైల్ డేటా ఖర్చు లేకుండా నేరుగా లైవ్ టీవీ ప్రసారాలు అందించేందుకు డైరెక్ట్-టు-మొబైల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసార భారతి వచ్చే నెలలో డీ2ఎమ్ సేవల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా సెల్యులార్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్స్‌లో లైవ్ టీవీ, వార్తలు చూడొచ్చని నిపుణులు వెల్లడించారు.