అమృత్సర్ జిమ్ వద్ద కాల్పుల కలకలం: దూసుకెళ్లిన దుండగులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమృత్సర్
అమృత్సర్ సమీపంలోని మెహతా చౌక్ వద్ద ఉన్న జిమ్ వెలుపల ఇద్దరు ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్మిందర్ సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో దుండగులు జరిపిన కాల్పులతో జిమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మూడు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకుని సీసీటీవీ టేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.