నీటి ఎద్దడిలోనూ కంచిపల్లి చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: ప్రకాశం

ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కంచిపల్లి చెరువులో వాటర్ ట్యాంకర్లతో నీటిని నింపి నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, భోజన వసతులు కల్పిస్తున్నారు.