నెల్లూరులో భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేటు హాస్టళ్ల నిర్లక్ష్యం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరంలో ప్రైవేటు వసతిగృహాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. రామలింగాపురం వంతెన వద్ద జరిగిన అగ్నిప్రమాదం హెచ్చరిస్తున్నా నిర్వాహకుల్లో మార్పు రాలేదు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఆశ్రయం పొందుతున్న వారి వివరాలు సేకరించకుండా కేవలం డబ్బులే పరమావధిగా వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసుల తనిఖీలు లేకపోవడంతో నగరంలోని హాస్టళ్లలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.