తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు: వంద కుటుంబాలకు ఆత్మీయ స్వాగతం

రిపోర్టర్: సతీష్ స్థలం: నంద్యాల

సిరివెల్ల మండలం కామినేనిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి నాయకత్వంలో సుమారు వంద కుటుంబాలు వైయస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరమని భూమా అఖిల ప్రియ రెడ్డి - ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లడించారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ రాజకీయ నాయకులుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని ఆమె స్పష్టం చేశారు. భూమా కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే వీరంతా పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.