భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు విమానాల దారి మళ్లింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్‌కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అలాగే వాతావరణం అనుకూలించక పలు విమానాలు రద్దయ్యాయి. భోగాపురం వెళ్లాల్సిన మంత్రుల విమానం నాగపూర్‌కు మళ్లింది. ప్రయాణికులు విమాన వివరాలు ముందుగానే పరిశీలించాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.