కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సమక్షంలో మళ్ళీ టీడీపీలోకి యర్రంరెడ్డి గోవర్థన్రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోవూరు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడిన సీనియర్ నేత యర్రంరెడ్డి గోవర్థన్రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరారు. ఈ ఉదయం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసంలో జరిగిన కీలక చర్చల్లో పాల్గొని, తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆమెకు స్పష్టం చేశారు.