ఢిల్లీలో కాలేజ్ విద్యార్థుల కోసం పది వేల హాస్టల్స్ నిర్మాణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

బయటి ప్రాంతాల నుంచి వచ్చే కాలేజ్ విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో పది వేల మంది విద్యార్థుల కోసం సరికొత్త హాస్టల్స్ నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. విద్యార్థులకు సురక్షితమైన వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, దీనివల్ల తల్లిదండ్రులకు ఆందోళన తగ్గుతుందని ఆమె స్పష్టం చేశారు.