దానం నాగేందర్ అనర్హత వేటు రేవంత్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతించారు. ఇది బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దక్కిన ఘన విజయం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపు మరియు చిల్లర రాజకీయాలకు ఇది గట్టి చెంపపెట్టు అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.