చినగంజాం మండల అభివృద్ధికి ఏలూరి సహకారం మరువరానిది: ఎంపీపీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: బాపట్ల
చినగంజాం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. గ్రామాల అభివృద్ధికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందించిన సహకారం మరువరానిదని ఎంపీపీ కొనియాడారు. ఐదేళ్ల పాలన ఈ నెల 24తో ముగియనున్న నేపథ్యంలో ఎంపీపీ, ఉప ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.