క్షేత్ర సహాయకుడికి షోకాజ్ నోటీసులు జారీ

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

ఉపాధి కూలీలను సొంత పొలం పనులకు మళ్లించిన ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం రేజేరులో క్షేత్ర సహాయకుడు మల్లేశ్వరరావు ఉపాధి పనుల్లో ఉన్న కూలీలను తన పొలం కలుపు తీసేందుకు పంపినట్లు విచారణలో తేలింది. ఈ వార్తపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపించి, బాధ్యుడైన మల్లేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.