దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఈస్ట్ జోన్ జట్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

చెన్నై వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్‌ను డ్రాగా నిలిపి ఈస్ట్ జోన్ చాంపియన్‌గా నిలిచింది. పన్నెండేళ్ల నిరీక్షణ తర్వాత ఈస్ట్ జోన్ మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐక్యతతోనే ఈ విజయం సాధ్యమైందని కిషన్ పేర్కొన్నాడు.