సివిల్ సప్లయ్స్ వ్యవహారాల్లో కుటుంబ జోక్యంపై సమగ్ర విచారణ కోరిన మిల్లర్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
సివిల్ సప్లయ్స్ వ్యవహారాల్లో ఓ కుటుంబం తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నదంటూ సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయని, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తండ్రి వ్యాపార వ్యవహారాలకు సహకరిస్తూ టెండర్లు, సీఎంఆర్లలో చక్రం తిప్పుతున్నారని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్లోనూ ఈ ఫ్యామిలీ హవా నడుస్తోందని, ముక్కుపిండి చందాలు వసూలు చేస్తూ రైస్ మాఫియాను ప్రోత్సహిస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని పలువురు మిల్లర్లు డిమాండ్ చేశారు.