విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి ఘటనలో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో దేవినేని అవినాశ్, జక్కంపూడి రాజా, పేర్ని కిట్టుతో పాటు సుమారు 60 మంది వైఎస్సార్సీపీ నేతలు, రౌడీషీటర్లపై కృష్ణలంక, మాచవరం, సూర్యారావుపేట పోలీసుస్టేషన్లలో హత్యాయత్నం, ఎట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా కర్రలు, రాళ్లతో వచ్చి అల్లర్లు సృష్టించినట్లు పోలీసులు వీడియో ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.