అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలు: వీటో అస్త్రంతో డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: Washington

అమెరికా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్ లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధిస్తే వారు తీసుకొచ్చే ఏ శాసనాన్నీ ఆమోదించకుండా తన అధ్యక్ష వీటో అధికారాలను పూర్తిగా ఉపయోగిస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు బిల్లులు పంపితే తన వీటోతో తిరస్కరిస్తూ మిస్టర్ వీటోగా మారడానికి వెనుకాడనని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.