ఆమదాలవలస అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

రిపోర్టర్: Pydi. Suryanarayana స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కృష్ణాపురం అంగన్వాడి కేంద్రంలో పోషకాహార వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీడీపీఓ సుగుణ పరిశీలించి, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస సెక్టర్ పరిధిలోని అంగన్వాడి సిబ్బంది, సూపర్వైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన కల్పించారు.