మార్లగుంటలో వీధికుక్కల స్వైరవిహారంతో వణికిపోతున్న స్థానిక ప్రజలు

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

తిరుపతి జిల్లా డక్కిలి మండలం మార్లగుంట గ్రామంలో పిచ్చికుక్కల బెడద తీవ్రమైంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న ఒకటో తరగతి విద్యార్థి వెంకట మహేంద్రపై కుక్క దాడి చేసి కరిచింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రికి తరలించి ఇంజెక్షన్లు చేయించారు. వీధుల్లో కుక్కల సంచారం హెచ్చడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను నివారించాలని కోరుతున్నారు.