కొండచరియల ప్రమాదాలను ముందుగానే గుర్తించేలా ప్రవాహ్ యాప్ రూపకల్పన
రిపోర్టర్: విజయ్
స్థలం: జబల్పుర్
కొండ ప్రాంతాల్లో ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్న కొండచరియల విరిగిపడే ముప్పును ముందుగానే అంచనా వేసి హెచ్చరించేలా జబల్పుర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రవాహ్ పేరిట ఓ సరికొత్త మొబైల్ యాప్ను అభివృద్ధి చేసినట్లు విద్యార్థి గుల్షన్ కుమార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ యాప్ ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా ఆఫ్లైన్లో సమర్థంగా పనిచేస్తుందని, దీని ద్వారా పెను ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.