ఆరోగ్య పరీక్షలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.