ఈ చలాన్ ఏపీకే ఫైల్ తో వ్యక్తి ఖాతా నుంచి రూ.85 వేలు మాయం
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన షేక్ అసిఫ్ మొబైల్‌కు ఈ-చలాన్ పేరుతో వచ్చిన అనుమానాస్పద ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేయడంతో రూ.85 వేలు కోల్పోయాడు. సైబర్ నేరగాళ్లు అతని వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్ చేసి కాంటాక్ట్ నంబర్లకు సందేశాలు పంపడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ వెంటనే స్పందించి బాధితుడి ఖాతాను హోల్డ్ చేయించి సైబర్ కోణంలో దర్యాప్తు చేపట్టారు.