అనధికార బాణాసంచా తయారీపై ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అనధికార బాణాసంచా తయారీ, నిల్వ మరియు అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా మైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని అధికారులు తెలిపారు.