తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుమల

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, సింగపూర్ హోంమంత్రి కే షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇరువురు ప్రముఖులు శ్రీవారి ఆలయానికి చేరుకోగా, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు వేద పండితులు వారికి సాదర స్వాగతం పలికారు. గర్భాలయంలో కొలువైన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.