రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయ జోక్యంపై అశోక్ గెహ్లాట్ ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో ప్రభుత్వ జోక్యంపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లుగా జైపూర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగకపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. క్రీడా సంఘాలలో రాజకీయాలు హద్దు మీరామన్న ఆయన, ఆర్సీఏ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను డిమాండ్ చేశారు.