తెలంగాణలో రేపు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల బంద్
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న యాజమాన్యాలు, బంద్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తీవ్రంగా హెచ్చరించాయి.