గౌరీ పరమేశ్వర ఆలయానికి మాజీ కార్పొరేటర్ భారీ విరాళం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

పెదగంట్యాడ దుర్గావాణిపాలెం శ్రీ శ్రీ శ్రీ గౌరీపరమేశ్వరుల ఆలయ అభివృద్ధి కొరకు 74వార్డ్ మాజీ కార్పొరేటర్ శ్రీ తిప్పల వంశీ రెడ్డి ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆకాంక్షించారు.