కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ నేత గండి యాదగిరి తీవ్ర స్థాయిలో మండిపాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: జనగామ

కేసీఆర్ హయాంలోనే రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గండి యాదగిరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం వడిచెర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్ నినో సాకుతో సాగునీరు, కరెంటు ఇవ్వలేమని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. పట్టభద్రులు ఈ విషయాలను గమనించి ఎమ్మెల్సీ ఎన్నికల్ లో బీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.