'లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయండి': సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు రుణ మంజూరు మొత్తం పెరిగినా ఆశించిన స్థాయిలో లేదని, కొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో జరిగిన 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన సమీక్షించారు. కౌలు రైతులకు రుణాలు అందించాలని, అమరావతి ఫైనాన్షియల్‌ హబ్‌లో కార్యాలయాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రుణాల చెల్లింపులో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు ప్రశంసించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.