సిరిసిల్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా పోస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: Telangana

సిరిసిల్ల జిల్లా ఏర్పాటు నుంచి సాగునీరు, రైతులు మరియు నేతన్నల సంక్షేమం వరకు కేటీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని BRS Party News అధికారిక ఖాతాలో పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజ్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి సిరిసిల్ల రూపురేఖలను పూర్తిగా మార్చేశారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి లాంటి వారు టూరిస్టులా వచ్చి పోతారని, కానీ కేటీఆర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటారని ఆ పోస్టులో స్పష్టం చేశారు.