భావోద్వేగం: తల్లితో జరిగిన ఆఖరి సంభాషణను గుర్తు చేసుకున్న గోవిందా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

తమ్ము మోసగించిన వారిని ఎప్పటికీ క్షమించాలంటూ తన తల్లి నిర్మలా దేవి చేసిన విజ్ఞప్తిని బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఏబీపీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తల్లి మరణానికి ముందు రోజులను, ఆమె తనకు చెప్పిన మాటలను కన్నీటిపర్యంతమై పంచుకున్నారు. దేవుడు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతగా ఉండాలని, తనకు ద్రోహం చేసిన వారిని క్షమించాలని తల్లి కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.