ఇజ్రాయెల్ ఎన్నికల పోరు: నెతన్యాహు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారంటూ విపక్షాల సంచలన ప్రకటన

రిపోర్టర్: సునీల్ స్థలం: జెరూసలెం

ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడిన నేపథ్యంలో నెతన్యాహు విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని యైర్ గోలన్ వెల్లడించారు. అయితే అత్యధిక స్థానాలు సాధించిన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ తెలిపారు.