దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు సమ్మె
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు కీలక సమాచారం. డిమాండ్ల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. నాలుగు శనివారాలు సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడంతో సమ్మెకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని యూనియన్ నేతలు స్పష్టం చేశారు.