బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

బొబ్బిలి పురపాలక సంఘం ముప్పై ఐదో వార్డు సిపిఎం అభ్యర్థి మంగళగిరి పద్మను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూజర్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కౌన్సిల్లో పోరాటం చేసే నిజమైన గొంతుక సిపిఎం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.