రాజమహేంద్రవరం-విజయనగరం జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 367 కి.మీ మేర 516ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.3,350 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 240 కి.మీ పనులు పూర్తయ్యాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రోడ్డు వల్ల అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కావడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.