రాయలసీమ ఉద్యాన హబ్‌పై రీల్స్ పోటీల నిర్వహణకు కలెక్టర్ ప్రకటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుపతి
రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికపై అవగాహన కల్పించేందుకు రీల్స్, వీడియోల పోటీ నిర్వహిస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మదనపల్లెలో త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై 60 నుండి 90 సెకన్ల నిడివితో వీడియోలు రూపొందించాలని కోరారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు ఉందని, అక్టోబరు 2న జరిగే బహిరంగ సభలో విజేతలను సత్కరిస్తామని కలెక్టర్ వెల్లడించారు.